జాన్ వర్డ్స్ వర్త్, అన్ కుక్సన్ దంపతుల ఐదుగురు సంతానంలో రెండవవాడు విలియం వర్డ్స్ వర్త్. ఇతను ఇంగ్లాండు లోని కుంబర్లాండ్ లోని కాకర్ మౌత్ లో ఏప్రియల్ 7 1770 న జన్మించాడు. ఈ కుంబర్లాండ్, ఆగ్నేయ ఇంగ్లాండ్ లో ప్రకృతి సౌందర్యంతో అలరారు లేక్ జిల్లా లోని భాగం. వర్డ్స్ వర్త్ తోబుట్టువులందరూ జీవితంలో మంచి విజయాలు సాధించారు. ఇతని తరువాత సంవత్సరానికి జన్మించిన సోదరి డొరోతి వర్డ్స్ వర్త్ ఒక కవి మరియు డయారిస్ట్. పెద్దన్న రిచర్డ్ లండను నగరంలో లాయర్. చిన్నన్న జాన్ ఈస్ట్ ఇండియా కంపెనీనందు కేప్టనుగా ఎదిగాడు. చిట్టచివరివాడయిన క్రిస్టఫర్ కేంబ్రిడ్జి లోని ట్రినిటీ కాలేజిలో మాస్టరుగా ఎదిగాడు. 1778లో వర్డ్స్ వర్త్ తల్లి మరణం తర్వాత, ఇతని నాన్న గారు హాక్స్ హెడ్ గ్రామర్ బడిలో చేర్పించాడు. సోదరి డొరోతిని యాక్షైర్ లో బంధువుల ఇంట్లో నివసించటానికి పంపాడు. ఆ తరువాత 9 సంవత్సరాల వరకు అన్నచెల్లెల్లిద్దరూ కలుసుకోలేదు. వర్డ్స్ వర్త్ 13 ఏండ్ల వయసులో పితృవియోగం కలిగింది.[1] రచయితగా వర్డ్స్ వర్త్ అరంగేట్రం 1787వ సంవత్సరంలో "ది యూరోపియన్ మాగజైన్ "లో చిన్న పద్యం ప్రచురించడం ద్వారా జరిగింది. ఇదే సంవత్సరం తను కేంబ్రిడ్జ్ సెయింట్ జాన్స్ కాలేజిలో చేరి 1791వ సంవత్సరానికి బి యే డిగ్రీలో ఉత్తీర్ణుడయినాడు.[2] తొలి రెండు వేసవి శలవులకూ హాక్స్ హెడ్ కు తిరిగి వచ్చాడు, ఆ తరువాతి శలవులను నడక యాత్రలు, ప్రకృతి రమణీయత ఉట్టిపడే ప్రదేశాలను దర్శిస్తూ గడిపాడు. 1790వ సంవత్సరంలో యూరోప్ నడక యాత్రకు వెళ్లాడు. ఈ యాత్రలో ఆల్ప్స్ పర్వతాలు మూలమూలలూ దర్శించాడు. ఇంకా ఆక్కడికి దగ్గరలోని ఫ్రాన్స్, స్విడ్జర్లాండ్, ఇటలీ దేశాలలోని సమీప ప్రాంతాలను కూడా దర్శించాడు. ఇతని చిన్న తమ్ముడు కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజి మాష్టరుగా ఎదిగాడు.[3]
విలియం వర్డ్స్ వర్త్ తల్లి పేరేమిటి ?
Ground Truth Answers: అన్ కుక్సన్అన్ కుక్సన్అన్ కుక్సన్
Prediction: